సింగరేణి​ క్రికెట్ విన్నర్ ​శ్రీరాంపూర్​

రామగుండం 1,2 కంబైన్డ్​టీమ్ రన్నర్  

కోల్​బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: సింగరేణి కంపెనీ లెవల్ ​క్రికెట్ ​పోటీల్లో విన్నర్​గా శ్రీరాంపూర్​ ఏరియా జట్టు నిలిచింది. ఆసిఫాబాద్​జిల్లా గోలేటీ భీమన్న స్టేడియంలో మూడు రోజులు నిర్వహించిన క్రికెట్​ పోటీల్లో గురువారం శ్రీరాంపూర్– రామగుండం1,2 కంబైన్డ్​ జట్ల మధ్య ఫైనల్​ మ్యాచ్​జరిగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోటీలో ఫస్ట్ శ్రీరాంపూర్​జట్టు బ్యాంటింగ్ ​చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 రన్స్​ చేసింది. అనంతరం బ్యాంటింగ్​కు దిగిన రామగుండం1,2 జట్టు 20 ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో శ్రీరాంపూర్​జట్టు విన్నర్​గా నిలిచింది. 

విజేతలకు బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్​ బహుమతులు అందజేశారు. ఏఐటీయూసీ లీడర్ ​తిరుపతి, ఏఎస్ వో టూజీఎం కె.రాజమల్లు, ఏరియా ఇంజినీర్ భీంరావు జాడే, ప్రాజెక్టు ఇంజినీర్​ వీరన్న, పర్సనల్​ మేనేజర్​రెడ్డిమల్ల తిరుపతి, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల స్పోర్ట్స్​ సూపర్​ వైజర్లు సీహెచ్.అశోక్​, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.