కుక్కల దాడి నుంచి చుక్కల దుప్పిని కాపాడినా..

  • స్పందించని ఫారెస్ట్ ఆఫీసర్లు

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కడంబ భీమన్న గుడి సమీపంలో ఆదివారం ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. అటుగా వెళ్తున్న కౌటాల మండలం బొదంపల్లికి చెందిన ఆనిల్ అనే యువకుడు కాపాడి గుడి దగ్గరకు తీసుకువచ్చాడు. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు. కానీ అధికారులు గంటలు గడిచినా స్పందించలేదు. 

గాయాలతో రక్తస్రావమైన దుప్పి గుడి దగ్గరే ప్రాణాలు వదిలింది. అధికారులు, సిబ్బంది బాధ్యతారాహిత్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైమ్​కు చేరుకొని చికిత్స అందించలేదని, ఫలితంగా దుప్పి చనిపోయిందని మండిపడ్డారు. దీనిపై కాగజ్ నగర్ ఇన్​చార్జి రేంజ్ ఆఫీసర్ రమాదేవి సంప్రదించగా.. సిబ్బందిని ఘటనా స్థలానికి పంపామని, అప్పటికే దుప్పి చనిపోయిందని సమాధానమిచ్చారు.