కోటపల్లి, వెలుగు: కోటపల్లి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. పిన్నారం గ్రామంలోని అంగన్వాడీలో ఇటీవల బాలింతలు, గర్భిణిలకు గుడ్లు పంపిణీ చేశారు. వాటిని ఉడకబెడితే కుళ్లిన వాసన వచ్చాయి. అనుమానం వచ్చి ఉడకబెట్టని గుడ్లను పగులగొట్టగా పాడైపోయి కుళ్లిన వాసన వచ్చాయి.
పౌష్టికాహారంలో అందిచాల్సిన అంగన్వాడీల్లో ఇలా నాసిరకం, పాడైపోయిన గుడ్లు, ఇతర సామాన్లు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవిని వివరణ కోరగా కుళ్లిపోయిన కోడిగుడ్లను పరిశీలించి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అన్నారు.