కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : ఎస్పీ రూపేశ్​

సంగారెడ్డి టౌన్, వెలుగు: కొత్త చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రూపేశ్​ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ ఆఫీసులో అధికారులు, సిబ్బందికి శిక్షణా తరగతులు  నిర్వహించారు .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ చట్టాల గురించి నేర్చుకోవాలన్నారు. జిల్లా జడ్జి రాధాకృష్ణ జోహార్  మారిన సెక్షన్స్, చాప్టర్లను ప్రతి ఒక్కరికి వివరించారు. 

గత సెక్షన్లతో పోల్చినప్పుడే తొందరగా అర్థమవుతాయని సూచించారు. స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు.. చార్జిషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై మార్పుల గురించి వివరించారు. శిక్షణా తరగతుల్లో ఎస్ హెచ్ వోలు, ఎస్ఐలు, స్టేషన్ రైటర్స్,  ఇన్​స్పెక్టర్లు, పోలీస్​సిబ్బంది పాల్గొన్నారు.