నారాయణ్ ఖేడ్, వెలుగు: గంజాయి సాగు, రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు. గురువారం ఖేడ్ డీఎస్పీ ఆఫీస్ లో పోలీస్అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులను నాయస్థానం ముందు హాజరుపరచాలన్నారు. స్కూల్స్, కాలేజ్‌ల్లో స్టూడెంట్స్‌కు డ్రగ్స్పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ క్రైమ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. గతంలో గంజాయి సాగు, అక్రమ రవాణా చేసిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మీటింగ్‌లో డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, చంద్ర శేఖర్, రమేశ్, ఎస్ఐలు పాల్గొన్నారు.