ప్రజలకు అండగా ఉంటాం : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

  • 32 మంది ఆదివాసీ మహిళలకు కుట్టు మెషీన్ల అందజేత

జైనూర్, వెలుగు: ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జైనూర్​లో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 32 మంది ఆదివాసీ మహిళలకు చేతన ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా కుట్టు మెషీన్లు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రజల అభివృద్ధికి పోలీస్ శాఖ నిత్యం అండగా ఉంటుందని తెలిపారు.

 ప్రతికూల పరిస్థితుల్లో కూడా పోలీసులు విధులు నిర్వర్తిస్తారని, ప్రజా భద్రతతో పాటు వారి సంక్షేమానికి పాటుపడతారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ కరుణాకర్, జైనూర్ సీఐ రమేశ్, ఎస్సైలు, సిబ్బంది, చేతన ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, సభ్యులు పాల్గొన్నారు.