పోలీసు కుబుంబాలకు అండగా ఉంటాం : ఎస్పీ బాలస్వామి

మెదక్​టౌన్, వెలుగు: మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ బాలస్వామి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శివ్వంపేట పీఎస్​కు చెందిన కానిస్టేబుల్​ లక్ష్మారెడ్డి గత సంవత్సరం యాక్సిడెంట్​ లో చనిపోవడంతో అతడి కుటుంబానికి రావాల్సిన రూ.30 లక్షల చెక్కు అందజేశారు. 

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. లక్ష్మా రెడ్డి కుటుంబానికి శాఖాపరంగా రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, ఏవో లక్ష్మీ, లావణ్య, లత, శోభన్​బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.