బెల్లంపల్లి, వెలుగు : రైల్వే శాఖలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్.నాగరాజు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు బెల్లంపల్లి పట్టణంలోని
సీఅండ్ డబ్ల్యూ, ఓహెచ్ఈ, టీఆర్డీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. కరోనా సమయంలో ఇవ్వాల్సిన 18 నెలల డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్ర టరీ జి.సాంబశివుడు, ట్రెజరర్ షోకేస్ మీనా, సంఘం సభ్యులు పాల్గొన్నారు.