కూతురి విడాకుల విషయంలో గొడవ.. అత్తను చంపిన అల్లుడు

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. అల్లుడు విచక్షణారహితంగా అత్తపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. చున్నం బట్టివాడకు చెందిన నెల్లి విజయ కూతురు మాళవికను మంచిర్యాల పట్టణానికి చెందిన సాత్రం వెంకటేశ్ కు ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు.ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో బిడ్డ విడాకుల విషయంలో విజయకు, వెంకటేశ్ కు గొడవలు అయ్యాయి. 

కోపం పెంచుకున్న వెంకటేశ్ నిన్న రాత్రి తాగి వచ్చి విజయపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విజయ అక్కడికక్కడే మృతి చెందింది.  పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్ విజయను వారం రోజుల క్రితం కూడా కొట్టినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.