గంటల వ్యవధిలో అల్లుడు, అత్త మృతి

చేగుంట, వెలుగు: మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో ఆదివారం గంటల వ్యవధిలో అల్లుడు, అత్త చనిపోయారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్​అసిస్టెంట్​గా పనిచేసే నర్సింహులు (53) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు బిడ్డలు, కొడుకు ఉన్నారు. ఆరోగ్యం విషమించడంత ఆదివారం చనిపోయాడు. ఈ విషయం పిల్లను ఇచ్చిన అత్త నర్సమ్మకు తెలిసింది. 

ఆమె సిద్దిపేట జిల్లా గజ్వేల్​మండలం శ్రీగిరి పల్లిలో ఉంటోంది. అక్కడి నుంచే ఏడ్చుకుంటూ వచ్చి నర్సింహులు శవంపై పడి విలపించింది. తన బిడ్డ, మనవరాళ్ల పరిస్థితి ఏమిటని రాత్రి వరకూ ఏడుస్తూనే ఉంది. ఈ బాధతో ఆమెకు గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచింది.