Post Office Savings Schemes: పోస్టాఫీస్​సేవింగ్స్​ స్కీంల వడ్డీ రేట్లు మారాయా?..ఫుల్​ డిటెయిల్స్​ ఇవిగో 

పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలుగా ప్రసిద్ది చెందిన చిన్న పొదుపు పథకాలకు నాలుగో త్రైమాసికంలో వడ్డీరేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనవరి నుంచి మార్చి 2025 వరకు పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.  

త్రైమాసికానికోసారి చిన్న పొదుపు పథకాల రేట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షిస్తుంది. చిన్న పొదుపు పథకాలలో పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​(PPF) సుకన్య సమృద్ధి యోజన(SSY) మహిళా సమ్మాన్​ సేవింగ్స్​ సర్టిఫికెట్​, కిసాన్​ వికాస్​ పత్ర, నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికెట(NSC) , సీనియర్​ సిటిజన్​ సేవింగ్స్​ స్కీమ్​(SCSS) వంటివి ఉంటాయి. 

Post Office Savings Schemes వడ్డీరేట్లు

  • సేవింగ్స్​ డిపాజిట్​ 4శాతం
  • 1సంవత్సరం టైమ్​ డిపాజిట్​ 6.9 శాతం
  • 2సంవత్సరం టైమ్​ డిపాజిట్​ 7 శాతం
  • 3సంవత్సరం టైమ్​ డిపాజిట్​ 7.1 శాతం
  • 5సంవత్సరం రికరింగ్​ డిపాజిట్​ 6.7శాతం
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్​ స్కీమ్ 8.2 శాతం 
  • నెలవారి ఇన్ కమ్​ అకౌంట్ పథకం 7.4 శాతం 
  • నేషనల్ సేవింగ్స్​ సర్టిఫికెట్​ 7.7 శాతం 
  • పబ్లిక్​ ప్రావిడెంట్ ఫండ పథకం 7.1 శాతం 
  • కిసాన్​ వికాస్​ పత్ర 7.5 శాతం 
  • సుకన్య సమృద్ధి యోజన 8.2 శాతం 

2024–25 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు జనవరి 1 2025 నుంచి మార్చి 31, 2025 తో ముగుస్తుంది. మూడో త్రైమాసి కంలో నోటిఫై చేయబడిన వడ్డీరేట్లే కొనసాగించడం జరుగుతుందని డిపార్ట్​ మెంట్​ ఆఫ్​ ఫైనాన్షియల్​ మినిస్ట్రీ  ఓ ప్రకటనలో తెలిపింది.