పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో అస్తిపంజరం కలకలం

సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామ శివారులో కుళ్లిపోయిన మృతదేహం బయటబడింది. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో  గుర్తుతెలియని వ్యక్తి అస్తిపంజరం కలకలం రేపుతుంది. దాదాపు 15 రోజుల క్రితం చనిపోయిన పురుషుడి అస్తిపంజరంగా స్థానికులు దాన్ని గుర్తించారు. పూర్తిగా చర్మం ఊడిపోయి అస్తిపంజరంగా మిగిలి ఉంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి బ్లాక్ కలర్ ప్యాంటు, షర్టు కలిగి ఉన్నాడని, అతని వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మృతదేహం గురించి ఏమైనా సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలుపగలరని పోలీసులు కోరారు.