నస్పూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం సీసీసీ కార్నర్ వద్ద ఉన్న నర్సయ్య భవన్లో నిర్వహించిన మండల కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా హామీలు నెరవేర్చాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కమ్యూనిస్టు పార్టీ నస్పూర్ మండల నిర్మాణ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 4న నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, లింగం రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.దాసు, లీడర్లు కె.నగేశ్, ఆర్.చంద్రశేఖర్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.