సింగరేణి మనుగడకు ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి : జీఎం జి.దేవేందర్

  • మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్
  •  ఉద్యోగులకు ప్రమోషన్​ ఆర్డర్స్​అందజేత​

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ నిర్దేశించిన 72 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. బొగ్గు ఉత్పత్తి, రవాణాపై సంస్థ మనుగడ, పురోభివృద్ధి ఆధారపడి ఉంటుందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​ అన్నారు. బుధవారం ఏరియాలోని కాసిపేట-1, 2 బొగ్గు గనులను సందర్శించి నిర్దేశిత ఉత్పత్తి టార్గెట్​పై గనుల ఆఫీసర్లతో సమీక్షించారు. విధి నిర్వహణలో ఉద్యోగులు, కార్మికులు రక్షణ సూత్రాలు పాటించి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలన్నారు. రోజూవారీ ఉత్పత్తి లక్ష్యాలను కచ్చితంగా సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.

మైనింగ్​ మ్యాప్, ప్లాన్లను పరిశీలించారు. అంతకుముందు ఆయన ఉద్యోగులు, కార్మికులు, ఆఫీసర్లకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కాసిపేట2 భూగర్భ గనిలోకి దిగి పని స్థలాలను తనిఖీ చేశారు. గనికి చెందిన ఉద్యోగులకు జీఎం దేవేందర్, కేకే-5 గని ఉద్యోగులకు ఇన్​చార్జి మేనేజర్​ సీహెచ్.రమేశ్ సర్వీస్ లింక్డ్​ ప్రమోషన్స్​ఆర్డర్స్ ​అందజేశారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏఐటీయూసీ మందమర్రి,  బెల్లంపల్లి బ్రాంచీల సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ,  దాగం మల్లేశ్, గనుల మేనేజర్లు భూశంకరయ్య, లక్ష్మీనారాయణ, పిట్​సెక్రటరీలు మీనుగు లక్ష్మీనారాయణ, గొల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.