సింగరేణి ట్రైనింగ్​ను ​సద్వినియోగం చేసుకోవాలి : జీఎం ఎ.మనోహర్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల పిల్లలు, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను చూపేందుకు యాజమాన్యం కల్పిస్తున్న ఓకేషనల్​ ట్రైనింగ్​ను సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​అన్నారు. బుధవారం మందమర్రి సీఈఆర్​ క్లబ్​లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టైలరింగ్, బ్యూటీషీయన్, ఫ్యాషన్ ​డిజైనింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్, స్పోకెన్ ​ఇంగ్లీష్ కోర్సులను తన సతీమణి, సేవా అధ్యక్షురాలు సవితతో కలిసి జీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోల్​బెల్ట్ ​ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించడంతో కోసం ఏటా ఓకేషనల్ ​ఫ్రీ కోర్సులు నిర్వహిస్తుందని, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గతేడాది ఆయా కోర్సుల్లో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు, యువతులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఏరియా సింగరేణి పర్సనల్ ​మేనేజర్ ​ఎస్.శ్యాంసుందర్, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం ప్రెసిడెంట్​ రమేశ్, డీవైపీఎం ఆసిఫ్, ఖాదీ, విలేజ్​ ఇండస్ట్రీస్​బోర్డు రిజినల్​ఆఫీసర్​ జె.అనసూయ, సింగరేణి సేవా సమితి కో ఆర్టినేటర్ ​శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.