- విజేతగా ఆర్జీ 2, 3, ఏపీఏ జట్టు
గోదావరిఖని, వెలుగు : సింగరేణి 53వ జోనల్‌స్థాయి మైన్స్‌రెస్క్యూ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. రెండు రోజులు జరిగిన పోటీల్లో ఆర్జీ 2, 3, ఏపీఏ జట్టు ఓవరాల్ఛాంపియన్షిప్సాధించి విజేతగా నిలిచింది. రన్నరప్కప్ను భూపాలపల్లి జట్టు కైవసం చేసుకుంది. మూడో ప్లేసులో మందమర్రి, బెల్లంపల్లి జట్టు నిలిచింది. యైటింక్లయిన్ కాలనీలోని రెస్క్యూ స్టేషన్లో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ సెంట్రల్జోన్డైరెక్టర్ఆఫ్ మైన్స్సేప్టీ ఉమేశ్ఎం.సావర్కర్, సింగరేణి డైరెక్టర్జి.వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై విజేతలకు కప్‌లను అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో ప్రమాదాలను తగ్గించేలా టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. భవిష్య త్ లో ప్రమాదాలు లేని కంపెనీగా సింగరేణిని రూపొందించాలని పేర్కొన్నారు. పోటీల్లో బెస్ట్ రెస్క్యూ రిలేగా ఆర్జీ 1 జట్టు, బెస్ట్ స్టాట్యూటరీగా శ్రీరాంపూర్జట్టు, థియరీ స్టాట్యూటరీగా ఆర్జీ 2, 3, ఏపీఏ జట్టు, డ్రిల్అండ్పరేడ్లో ఆర్జీ1 జట్టు, ఫస్ట్ ఎయిడ్‌లో మందమర్రి జట్టు, ఫ్రెష్ ఎయిర్ బేస్‌లో ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం జట్టు, బెస్ట్రికవరీలో మందమర్రి, బెల్లంపల్లి జట్టు ఉత్తమ ప్రతిభను చూపి బహుమతులను సాధించాయి.
ఫస్ట్ బెస్ట్ కేప్టెన్‌గా కుదిరె అనిల్, సెకండ్ బెస్ట్ కేప్టెన్‌గా కె.పూర్ణ చందర్ నిలిచారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఎస్ జార్జ్జాన్, ఏఐటీయూసీ జనరల్సెక్రటరీ కె.రాజ్‌కుమార్, ఐఎన్టీయూసీ సీనియర్వైస్ ప్రెసిడెంట్పి.ధర్మపురి, సింగరేణి ఆఫీసర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్పొనుగోటి శ్రీనివాస్, జనరల్మేనేజర్లు చింతల శ్రీనివాస్, ఎల్వి సూర్యనారాయణ, కె.శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, రెస్క్యూ స్టేషన్సూపరింటెండెంట్ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.