సిగ్నేచర్ గ్లోబల్ ఆదాయం రూ. 10 వేల కోట్లు

హైదరాబాద్​, వెలుగు: రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన రియాల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ మార్చి 2026 నాటికి రూ. 10వేల కోట్ల ఆదాయాన్ని చేరుకోవచ్చని అంచనా వేసింది. అంతేగాక అప్పటికి తన కస్టమర్లకు16 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 3,800 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కంపెనీ ఇప్పటికే రూ.1,200 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని వెల్లడించారు.