భూంపల్లిలో 130 క్వింటాళ్ల రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం పట్టివేత

దుబ్బాక, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యాన్ని సిద్దిపేట టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భూంపల్లి పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన వంగ నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిద్దిపేట మండలం ఎన్సాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన కేసన్నగారి నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రజల నుంచి పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యాన్ని సేకరించి మరో చోట ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. 

ఇందులో భాగంగా ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని ఆదివారం డీసీఎంలో తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోలీసులు భూంపల్లి శివారులో పట్టుకున్నారు. 130 క్వింటాళ్ల రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యాన్ని అమ్మినా, నిల్వ చేసినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.