అక్రమ మట్టి రవాణాపై పోలీసుల దాడులు

  • జేసీబీతో పాటు 9 ట్రాక్టర్లు స్వాధీనం

కోహెడ, వెలుగు: అక్రమ మట్టి రవాణాపై సిద్దిపేట టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మండలంలోని కూరెల్ల పెద్ద చెరువు నుంచి అనుమతులు లేకుండా రాత్రిపూట తిప్పారపు నవీన్​కు చెందిన ఇటుక బట్టీలకు నల్ల మట్టి తరలిస్తున్నరనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి రైడ్​ చేశారు.​ 

ఈ దాడుల్లో జేసీబీతో పాటు 9 ట్రాక్టర్లను పట్టుకొని పీఎస్​కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.