హైదరాబాద్, వెలుగు: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ‘ఒక్కటిగా ఎదుగుదాం’ పేరుతో రూపొందించిన వీడియోను ఆయనతో తీసింది. మన ప్రజల ఆర్థికాభివృద్ధికి శ్రీరామ్ ఫైనాన్స్ కట్టుబడి ఉందని చాటి చెప్పడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రకటించింది. కస్టమర్‌లతో మంచి సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా వారి కలలను సాకారం చేస్తామని కంపెనీ తెలిపింది.
శ్రీరామ్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలిజబెత్ వెంకటరామన్ మాట్లాడుతూ ఫిక్స్డ్ డిపాజిట్లు, వెహికల్ ఫైనాన్సింగ్, పర్సనల్, గోల్డ్ లోన్ల ద్వారా కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చుతామని చెప్పారు.