హైడ్రాను జిల్లాలోనూ ఏర్పాటు చేయాలి : శ్రీపతి రాములు

నస్పూర్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని హైడ్రాను మంచిర్యాల జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రధాన  కార్యదర్శి శ్రీపతి రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కలెక్టరేట్​లో ఏవో రాజేశ్వర్ రావుకు వినతి పత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతూతో ముందుకు పోతున్న విధానానికి పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పారు.

 జిల్లాలో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయని, కబ్జాదారుల నుంచి వాటిని విడిపించాలని కోరారు. ఎన్​హెచ్​ఆర్​సీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్ యాదవ్, క్యాతం రాజేశ్, ఉప్పులేటి రవి, తలారి సమ్మయ్య, కుమ్మరి సతీశ్, నరేందర్ గౌడ్, శ్రీధర్, దాసరి నరేందర్, కలవేన స్వామి తదితరులు పాల్గొన్నారు.