హైదరాబాద్, వెలుగు: సేల్స్, మార్కెటింగ్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ శ్రేయాస్ మీడియా మహా కుంభ మేళా-2025 ప్రత్యేక ప్రకటనల హక్కులను దక్కించుకున్నట్టు ప్రకటించింది. 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదిక అవుతుంది.
ఆద్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌లో భాగమైన శ్రేయాస్ మీడియా కుంభమేళలో వెండింగ్ జోన్‌లు, అమ్యూజ్‌మెంట్ జోన్, ఫుడ్ కోర్ట్‌తో సహా పలు ఇతర వ్యాపారాల హక్కులను సైతం దక్కించుకుంది. రూ.6,300 కోట్ల అంచనా బడ్జెట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనున్న మహా కుంభమేళా-2025 కు ప్రపంచం నలుమూలల నుంచి 50 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని భావిస్తున్నారు.