సంగారెడ్డి, వెలుగు: ‘సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయాలి, తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎంకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు, అసోంలో ఇలాగే ప్రచారం చేస్తే ఒకరిని అరెస్ట్ చేశారు. మరి తెలంగాణలో ఎందుకు అరెస్ట్ చేయరు’ అని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సోమవారం నిర్వహించిన రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయకుంటే ప్రధాని మోదీ, సీఎం ఇద్దరూ కలిసినట్లేనన్నారు. బీజేపీకి ఓటేస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లే అవుతుందన్నారు. తెలంగాణ సమస్యల మీద కొట్లాడాలంటే బీఆర్‌ఎస్ క్యాండిడేట్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. సమవేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.