శివ్వంపేటలో భూమికి భూమి లేదంటే ఎకరాకు కోటి : జగదీశ్వర్ రెడ్డి

శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించే సంగారెడ్డి కెనాల్​ నిర్మాణంలో భూములు కోల్పోయే శివ్వంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామ రైతులతో సోమవారం నర్సాపూర్ రైతు వేదికలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించే తాము భూములు కోల్పోతే రోడ్డున పడాల్సి వస్తుందన్నారు.

అందువల్ల భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే  ఎకరాకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు. రైతుల డిమాండ్​ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఆర్ఐ కిషన్, లోక్​ సత్తా ఇన్​చార్జి చంద్రశేఖర్ పాల్గొన్నారు.