స్టాక్ మార్కెట్ లో నష్టాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం స్వల్ప నష్టాలతో మొదలైన మార్కెట్ చివరికి భారీ నష్టాలలో ముగిసింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతలో ఇంట్రాడే లోస్ కు వెళ్లి కోలుకున్నట్లే కనిపించినా.. ఒక్కసారిగా పడిపోవడంతో లక్షల కోట్లు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ సుమారు 1064 పాయింట్లు ( 1.30%) పడిపోయి 80,684 వద్ద నిలిచింది. దీంతో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.33 లక్షల కోట్లు పడిపోయి 258 లక్షల కోట్లకు చేరుకుంది.
అదే విధంగా నిఫ్టీ దాదాపు 325 పాయింట్లు (1.35 %) పడిపోవడంతో మార్కెట్లో రక్తప్రవాహం కొనసాగింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్టెల్ మొదలైన స్టాక్స్ ఈ రోజు మార్కెట్ ను పడేయడంలో కీలకపాత్ర పోషించాయి. కేవలం మీడియా సెక్టార్ తప్ప అన్ని సెక్టార్లు రెడ్ లో ముగిశాయి.
కీలక రేంజ్ బ్రేక్ డౌన్ చేసిన నిఫ్టీ:
భారీ సెల్లింగ్ ప్రెజర్ నడుమ ఇవాళ నిఫ్టీ కీలక రేంజ్ ను బ్రేక్డౌన్ చేసింది. గత కొంత కాలంగా కొనసాగుతున్న 24500 -24800 రేంజ్ ను డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. ఈ రేంజ్ బ్రేక్ డౌన్ చేయనంత వరకు మార్కెట్ కు ఎలాంటి ఇబ్బంది లేదని ఎనలిస్టుల అభిప్రాయం. కానీ ఇవాళ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ను బ్రేక డౌన్ చేయడంతో నిఫ్టీ మరింత పడే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం 24270-24300 స్ట్రాంగ్ సపోర్ట్ బేస్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 24100 వద్ద మరో సపోర్ట్ ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ రెండు సపోర్ట్ ల వద్దకు నిఫ్టీ చేరుకుంటే భారీ నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మార్కెట్ల భారీ పతనానికి కారణం ఏమిటి?
యూఎస్ ఫెడ్ పాలసీ డెసిషన్ బుధవారం (డిసెంబర్ 18) ఉండటంతో ఇన్వెస్టర్లు కాస్త ముందు జాగ్రత్త చర్యగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఫెడ్ ఔట్ కమ్ పై 25 పాయింట్లు ఫ్యాక్టర్ అయ్యింది మార్కెట్. కానీ యూఎస్ ఫెడ్ నుంచి హాకిష్ స్టేట్ మెంట్ వస్తుందేమోనన్న సందేహంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. ఫెడ్ పాలసీ ఔట్ కమ్ ముందు ఇండియన్ మార్కెట్లతో పాటు ఏసియన్ మార్కెట్లలో కూడా ఇదే పరిస్తితి కనిపిస్తోంది.
ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్న రూపీ:
ఇండియన్ రూపీ క్షీణించడం, ఫారెన్ ఫండ్ ఔట్ ఫ్లోస్ తో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మారింది. దీనికి తోడు ఇండియా ట్రేడ్ డెఫిసిట్ (వాణిజ్య లోటు) నవంబర్ లో రికార్డు స్థాయిలో 37.8 బిలియన్ డాలర్లుకు పెరిగింది.. అక్టోబర్ లో 27.1 బిలియన్ డాలర్లు నుండి అంతగా వాణిజ్య లోటు అంతగా పెరగడం కూడా ఒక కారణం. డాలర్ తో పోల్చితే ఇండియన్ రూపీ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మార్కెట్లలో ఈ పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా రూపీ క్షీణించడం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడంతో పారెన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లో భారీ ఎత్తున అమ్మకాలు జరుపుతున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలగలిసి మంగళవారం మార్కెట్ భారీ పతనానికి కారణమయ్యాయి.
ALSO READ | భారత దేశ ఎగుమతులు 4.85 శాతం తగ్గినయ్