స్టాక్ మార్కెట్పై బేర్ పంజా.. కోట్ల సంపద ఆవిరి.. కారణాలేంటి..?

స్టాక్ మార్కెట్ పై బేర్ పంజా విసిరింది. శుక్రవారం ఉదయం రెడ్ లో ఓపెన్ అయిన మార్కెట్ ఆ తర్వాత దారుణంగా ఫాల్ అయ్యింది. ఉదయం 10.37 గంటల ప్రాంతంలో ఇండెక్స్ లు ఇంట్రాడే లోస్ కు వెళ్లాయి.  సెన్సెక్స్ 1207 పాయింట్లు (1.4%) డ్రాప్ కాగా, నిఫ్టీ 368 పాయింట్లు  (1.49%) పడిపోవడంతో మార్కెట్ లో రక్తపాతం మొదలైందనే చెప్పాలి. దీంతో లార్జ్ క్యాప్ బ్లూచిప్ కంపెనీల నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీలు కూడా భారీగా పతనమయ్యాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సులు కూడా భారీగా పడటంతో ఇండియన్ విక్స్ (Volatility Index) 2.83% పెరగడంతో మధుపరులలో ఆందోళన మొదలైంది. 

  • మార్కెట్ పతనానికి కారణం

ఇండియన్ మార్కెట్లు హై వాల్యువేషన్ లో ఉన్నాయని ఎఫ్ఐఐ లు భావించడం భారీ పతనానికి కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగంగానే గురువారం రూ.3560 కోట్ల స్టాక్స్ అమ్మినట్లు తెలుస్తోంది. హై వ్యాల్యువేషన్ వల్ల మార్కెట్ పెరిగిన ప్రతీసారి భారీ ఎత్తున అమ్ముతుండటం గమనించాల్సిన విషయం.

  • డాలర్ పెరుగుదల.. రూపీ క్షీణత

మరోవైపు యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ఫారెన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్స్ నుండి వైదొలుగుతున్నారు. అదేవిధంగా యూఎస్ ఎన్నికల తర్వాత డాలర్ పెరుగుదల, ఇండియన్ రూపీలో క్షీణత వలన ఇప్పుడు భారీ లాభాల కోసం అమ్మకాలు జరిపుతున్నారు. శుక్రవారం ఓపెనింగ్ టైమ్ లో 84.86 గా ఉన్న ఇండియన్ రూపీ, 84.84కు పడిపోవడంతో ఎఫ్ఐఐల అమ్మకాలు జోరందుకున్నాయి. 

Also Read : నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దిగొచ్చిన ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ .. 5.48 శాతానికి డౌన్‌

ఫారెన్ ఇన్వెస్టర్లు వెనుదిరుగుతున్నా.. ఇండియన్ మార్కెట్లకు ఉన్న ఏకైక నమ్మకం ద్రవ్యోల్బణం పడిపోవడం. నవంబర్ CPI inflation 5.48% గా నమోదు కావడం మార్కెట్లు పాజిటివ్ సైన్ గా చూస్తున్నాయి. ఇదే కొనసాగితే ఆర్బీఐ (Reserve Bank of India) రేట్ కట్స్ ఫిబ్రవరీలో ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే మార్కెట్లకు మున్ముందు ఎలాంటి భయం లేదని చెబుతున్నారు. 

  • బేర్ పంజాతో భారీగా పడిన మెటల్, ఆటో, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ 

శుక్రవారం మార్కెట్లను భారీగా పడేసిన స్టాక్స్ లలో బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ ముందు వరుసలో ఉన్నాయి. టాటా స్టీల్ 2.77%, JSW స్టీల్ 2.53%, శ్రీరామ్ ఫైనాన్స్ 2.5%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.93%, హిందాల్కో 1.87% క్షీణించాయి. నిఫ్టీ బ్యాంకు 0.89%, నిఫ్టీ ఆటో 0.83%, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.03%, నిఫ్టీ ఐటీ 1.23%, నిఫ్టీ మెటల్ 2.01 %  పడిపోయాయి. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి.