ఆగని నష్టాలు..సెన్సెక్స్​502 పాయింట్లు డౌన్​..137 పాయింట్లు పడ్డ నిఫ్టీ

ముంబై :  విదేశీ నిధులు పెద్ద ఎత్తున తరలిపోవడంతోపాటు యుటిలిటీ, క్యాపిటల్ గూడ్స్,  మెటల్ స్టాక్స్​లో అమ్మకాల వల్ల బుధవారం వరుసగా మూడవ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఈక్విటీ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ వెనుకంజ వేశాయి.  యూఎస్​ ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్​ 502.25 పాయింట్లు పతనమై 80,182.20 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 634.38 పాయింట్లు తగ్గి 80,050.07 వద్దకు చేరుకుంది. బీఎస్​ఈలో 2,563 స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నష్టపోయాయి.  

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 137.15 పాయింట్లు క్షీణించి 24,198.85 వద్దకు చేరుకుంది.  సెన్సెక్స్​నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ మాత్రమే లాభపడ్డాయి.    బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.76 శాతం క్షీణించగా, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.61 శాతం పడిపోయింది.  సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో   బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ, హెల్త్ కేర్, ఐటీ లాభపడ్డాయి. గురువారం విడుదల కానున్న జపాన్,  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకుల వడ్డీ రేటు నిర్ణయాలతో పాటు యూఎస్​జీడీపీ డేటానూ పెట్టుబడిదారులు గమనిస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎనలిస్ట్​ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. 

ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు మంగళవారం రూ. 6,409.86 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.  ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై  హాంకాంగ్ లాభాల్లో స్థిరపడగా, టోక్యో నష్టాల్లో ముగిశాయి.  మిడ్ సెషన్ డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది.  గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 0.48 శాతం పెరిగి 73.67 డాలర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే వన్ మొబిక్విక్ సిస్టమ్స్ ఐపీఓ సక్సెస్​ అయింది. దీని షేర్లు 58 శాతం లాభంతో లిస్టయ్యాయి. హైదరాబాద్​ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ షేర్లు 20 శాతం పెరిగాయి.