109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. ​2024లో 5,898 పాయింట్లు అప్.. 1,913 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై: 2024 సంవత్సరం ఆఖరు రోజు ఈక్విటీ మార్కెట్లు కొద్దిగా నష్టపోయాయి. గ్లోబల్​ మార్కెట్ల నుంచి నెగటివ్​ సంకేతాలు, ఫారిన్​ఫండ్స్​ఔట్​ఫ్లో ఎక్కువగా ఉండటంతో సెన్సెక్స్​ 109.12 పాయింట్లు, నిఫ్టీ 0.10 పాయింట్లు నష్టపోయింది.  2024లో సెన్సెక్స్ 5,898.75 పాయింట్లు  (8.16 శాతం) ఎగబాకగా, నిఫ్టీ 1,913.4 పాయింట్లు  (8.80 శాతం) పెరిగింది.  ఈ ఏడాది సెప్టెంబరు 27న సెన్సెక్స్ 85,978.25 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. 

నిఫ్టీ కూడా అదే రోజున జీవితకాల గరిష్ట స్థాయి 26,277.35కి చేరుకుంది.  స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపాదన 2024లో రూ. 77.66 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 77,66,260.19 కోట్లు పెరిగి రూ. 4,41,95,106.44 కోట్లకు చేరింది. సెన్సెక్స్​లో టెక్ మహీంద్రా, జొమాటో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్ నష్టపోయాయి.  కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ లాభపడ్డాయి.  

బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.71 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.13 శాతం పెరిగింది. ఎఫ్​ఐఐలు సోమవారం రూ.1,893 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. ఆసియాలో మార్కెట్లలో షాంఘై నష్టపోగా, హాంగ్​కాంగ్​ లాభపడింది. కొత్త సంవత్సరం సెలవు కారణంగా టోక్యో, సియోల్​ మార్కెట్లు పని చేయలేదు. యూరప్ ​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ ​మార్కెట్లు సోమవారం నష్టపోయాయి.

13 పైసలు నష్టపోయిన రూపాయి

డాలర్​తో  రూపాయి మారక విలువ మంగళవారం 13 పైసలు తగ్గి ఆల్​టైం క్లోజింగ్​లో 86.65 (తాత్కాలికం)లకు చేరుకుంది. ఈ ఏడాదిలో రూపాయి దాదాపు మూడుశాతం నష్టపోయింది. ఫారిన్​ఫండ్​ఔట్​ఫ్లోలు ఎక్కువగా ఉండటం, డాలర్​మరింత బలోపేతం కావడంతో రూపాయి బలహీనపడుతోంది. వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్​ఫెడ్​అప్రమత్తంగా ఉండటంతోపాటు, ట్రంప్ ప్రకటనల​కారణంగా డాలర్​ఇండెక్స్​బలపడుతోంది. దేశీ స్థూల ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, వాణిజ్య లోటు పెరగడం, ఫారిన్​ఫండ్స్​ ఔట్​ఫ్లోలు పెరుగుతూనే ఉండటంతో రూపాయి బక్కచిక్కుతోంది.