ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి

  • జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పార్లమెంట్​కు సంబంధించి అడిషనల్​ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్​ప్రక్రియను జనరల్​అబ్జర్వర్​సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ స్థానానికి 44 మంది పోటీలో ఉన్నందున అడిషనల్​ఈవీఎంలను నియోజక వర్గాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సిబ్బందితో మాట్లాడారు. అనంతరం జనరల్ అబ్జర్వర్​ మాట్లాడుతూ..మెదక్​ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి  అక్రమ నగదు, మద్యం జప్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు,1950 టోల్ ఫ్రీ నెంబర్,  సీ-విజిల్​ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, సామాజిక మాధ్యమాల్లో గమనించే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, ప్రతిరోజు సకాలంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది  పాల్గొన్నారు.