ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించాలి.. మాలమహానాడు లీడర్లు

న్యూఢిల్లీ/కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై పునరాలోచన చేయాలని మాల మాహానాడు లీడర్లు కోరారు. ఈ మేరకు మాలమహానాడు ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌‌‌‌‌‌‌‌ పసుల రామ్మూర్తి, తెలంగాణ అధ్యక్షుడు జూపాల సుధీర్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు శుక్రవారం ఢిల్లీలో  నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌ మాగ్వనాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం మనువాదుల కుట్ర అని ఆరోపించారు. 

341 ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ను సుప్రీంకోర్టు పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష చేసి, రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దళితుల మధ్య విబేధాలు సృష్టించేందుకే వర్గీకరణను తీసుకొచ్చారన్నారు. అనంతరం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ వడ్డేపల్లి రాంచంద్రయ్యను కలిశారు. కార్యక్రమంలో మాలమహానాడు ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా జాతీయ యువజన ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు అరె దేవకర్ణ, రాష్ట్ర మహిళా కార్యదర్శి గంట బబిత పాల్గొన్నారు.