వ్యవస్థలో కీలకమైన బ్యాంకులు .. ఎస్‌‌‌‌బీఐ, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, ఐసీఐసీఐ

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్‌‌‌‌ (ఎస్‌‌‌‌బీఐ), హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌లను  వ్యవస్థలో అత్యంత కీలకమైన బ్యాంకులుగా అంటే డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ (డీ–ఎస్‌‌‌‌ఐబీ) గా రిజర్వ్  బ్యాంక్ (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) గుర్తించింది.  ఈ లిస్టులో చేరాలంటే బ్యాంకులు  క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ (అదనపు నిధుల) తో పాటు కామన్ ఈక్విటీ టైర్‌‌‌‌‌‌‌‌ 1 (సీఈటీ1– అదనపు క్యాపిటల్) ను గరిష్ట స్థాయిలో మెయింటైన్ చేయాలి. 

0.80 శాతం అదనపు సీఈటీ1 ఎస్‌‌‌‌బీఐ  నిర్వహిస్తోంది.  దీంతో డీఎస్‌‌‌‌ఐబీ లిస్ట్‌‌‌‌లో టాప్‌‌‌‌– 4 లో కొనసాగుతోంది. బకెట్ 1 బ్రాకెట్‌‌‌‌లో ఉంది.    హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ బకెట్ 2 బ్రాకెట్‌‌‌‌లో  ఉంది. ఇందుకోసం   0.40 శాతం హయ్యర్‌‌‌‌‌‌‌‌ సీఈటీ1 నిర్వహిస్తోంది.  ఎస్‌‌‌‌బీఐ, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంకులపై  హయ్యర్  డీ–ఎస్‌‌‌‌ఐబీ సర్‌‌‌‌ఛార్జ్‌‌‌‌ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి పడుతుందని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పేర్కొంది. అప్పటి వరకు ఎస్‌‌‌‌బీఐపై 0.60 శాతం, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌పై 0.20 శాతం  ఈ సర్‌‌‌‌‌‌‌‌ఛార్జ్ పడుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌ బకెట్ 1 బ్రాకెట్‌‌‌‌లో ఉంది. ఈ బ్యాంక్‌‌‌‌  సీఈటీ 1 రేషియో 0.20 శాతం ఉంది.