జీడీపీ గ్రోత్ అంచనాలు తగ్గించిన ఎస్‌‌బీఐ

న్యూఢిల్లీ:  ఇండియా జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  6.3 శాతం వృద్ధి చెందుతుందని  ఎస్‌‌బీఐ అంచనా వేసింది. ఆర్‌‌బీఐ వేసిన అంచనా 6.6 శాతం కంటే ఇది తక్కువ. గతంలో వేసిన 7.2 శాతం  నుంచి ఏకంగా 90 బేసిస్ పాయింట్లను  ఎస్‌‌బీఐ తగ్గించింది.

 ఆర్‌‌‌‌బీఐ  క్యాష్ రిజర్వ్‌‌ రేషియోని తగ్గించడం సానుకూల అంశమని, కానీ బ్యాంకుల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్‌‌పై పెద్దగా ప్రభావం ఉండదని   అభిప్రాయపడింది.   సీఆర్‌‌‌‌ఆర్ తగ్గించడం వలన బ్యాంకుల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3–4 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని ఎస్‌‌బీఐ అంచనా వేసింది.