ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మారాయి.. డిసెంబర్ 1 నుంచే అమలు..

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మారాయి. కొత్త రూల్స్ డిసెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డ్ ఛార్జీల్లో ఎస్బీఐ కొన్ని మార్పులుచేర్పులు చేసింది. డిసెంబర్ 1 నుంచి ఏకకాలంలో రూ.50 వేలకు మించి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి చేసే యుటిలిటీ బిల్ పేమెంట్స్పై 1 శాతం సర్ఛార్జ్ విధించాలని ఎస్బీఐ నిర్ణయించింది. 

ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్.. ఇతర యుటిలిటీ సర్వీసులకు సంబంధించి ఏక కాలంలో రూ.50 వేలకు పైగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్స్ చేయదలచిన యూజర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలి. 50 వేల రూపాయల లోపు చేసే పేమెంట్స్ పై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ కింద పేర్కొన్న ఎస్ బీఐ క్రెడిట్ కార్డులపై ఈ సర్ఛార్జ్ వర్తిస్తుంది.

చేతిలో డబ్బు లేనప్పుడు, షాపింగ్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో క్రెడిట్ కార్డ్‌‌లు చాలా ఉపయోగపడుతాయి. కొనుగోళ్లు చేయడానికి,  రివార్డ్‌‌‌‌‌‌‌‌లను సంపాదించడానికి ఇవి పనికి వస్తాయి. క్రెడిట్ కార్డ్​తో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ వీటి వాడకంపై కొన్ని పరిమితులు ఉంటాయనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఆలస్యంగా క్రెడిట్​కార్డు బిల్లు చెల్లించినా జరిమానాలు పడతాయి. మినిమం అమౌంట్​ (కనీస బిల్లు) కట్టకున్నా, ఆలస్యంగా చెల్లించినా ఫైన్లు తప్పవు. 

ALSO READ : Bank holidays in December:బ్యాంకులకు సెలవులే సెలవులు..నెలలో సగం రోజులపైనే

క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కనీస బకాయి మొత్తాన్ని సకాలంలో చెల్లించకున్నా,  ఆలస్యంగా చెల్లించినా క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌ దెబ్బతింటుంది. అంతేగాక బ్యాంకులు ఫ్లాట్ ఫీజును వసూలు చేస్తాయి. కనీస బకాయి మొత్తాన్ని చెల్లించినంత మాత్రాన వడ్డీ నుంచి తప్పించుకోలేం. అంతేగాక అన్ని క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లకు జీఎస్టీ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఫీజులో 18 శాతం వరకు వసూలు చేస్తారు. అందువల్ల.. క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు గానీ, తీసుకున్న తర్వాత గానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి వినియోగించడం మేలు.