మెదక్ ఎంపీ రఘునందన్ రావుని కలిసిన సంగారెడ్డి బీజేపీ శ్రేణులు

సంగారెడ్డి టౌన్, వెలుగు: మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం ఢిల్లీకి వెళ్తున్న సందర్భంగా సంగారెడ్డి బీజేపీ నాయకులు ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన విజయం మెదక్ ప్రజలకు అంకితమని తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉండి సేవలు చేస్తానని స్పష్టం చేశారు.

ఢిల్లీలో ప్రమాణం చేసిన అనంతరం నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కేంద్ర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని వెల్లడించారు. ఎంపీని కలిసిన వారిలో బీజేపీ మెదక్ పార్లమెంట్ కన్వీనర్ సంగమేశ్వర్,  జగన్, కృష్ణ, చంద్రశేఖర్, కౌన్సిలర్ రమేశ్, రవిశంకర్, శ్రీశైలం యాదవ్, సాయి, అంబదాస్, సత్యనారాయణ గౌడ్, విక్రమ్, శంకర్, వెంకటేశం, రాములు ఉన్నారు.