తుర్కపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ తనిఖీ

నారాయణ్ ఖేడ్,వెలుగు: తుర్కపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ ను మంగళవారం సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నారు. 

అనంతరం  హాస్పిటల్ పరిసరాలు పరిశీలించి డాక్టర్లకు,సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ సంధ్యారాణి, డీఎల్పీఓ బాగా రెడ్డి, డాక్టర్లు, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్   ఉన్నారు.