14 వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

నారాయణపేట, వెలుగు:  తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగలు సమ్మె 14వ రోజు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.  జాక్ అధ్యక్షుడు ఎల్లాగౌడ్ మాట్లాడుతూ..  రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులపై ప్రభుత్వం కనికరించడం లేదని వాపోయారు.  అయినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. 

 ధర్నా శిబిరాన్ని పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మి, పీవైఎల్​ జిల్లా కార్యదర్శి ప్రతాప్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి నర్సింహా,  పీఓడబ్యూ  జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ సంఘీభావం తెలిపారు.  కార్యక్రమంలో వెంకట్రాములు, గౌరమ్మ, విజయ, శివకుమార్, రాజు, మహిపాల్, అల్తాఫ్, మహేశ్వరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.