చిన్నశంకరంపేట, వెలుగు: స్కూల్లో టీచర్లను నియమించాలని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టిన సంఘటన శుక్రవారం మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో జరిగింది. గ్రామంలోని ప్రైమరీ స్కూల్ 2017లో అప్ గ్రేడ్అయి ప్రైమరీ, హై స్కూల్‌గా విడిపోయింది. కొన్ని రోజులుగా ప్రైమరీ స్కూల్ టీచర్లే హై స్కూల్స్టూడెంట్స్కు బోధన చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం టీచర్ల బదిలీలు చేపట్టినప్పటికీ హై స్కూల్‌కు తెలుగు, గణితానికి సంబంధించిన టీచర్లనే కేటాయించడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అయితే స్టూడెంట్స్ నష్టపోతారని వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్‌ముందు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. దీంతో ఎంఈవో, హెచ్ఎం సమీప స్కూళ్ల నుంచి టీచర్లను డిప్యూటేషన్ పై తీసుకొచ్చి స్టూడెంట్స్‌కు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.