నస్పూర్, వెలుగు : శ్రీరాంపూర్ ఏరియాలో 55 వార్షిక పక్షోత్సవాలు సోమవారం ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో ఏరియా జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్, కార్పొరేట్ జీఎం ఎలీషా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం ఎల్వీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. కంపెనీ వ్యాప్తంగా ఉద్యోగుల రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రతి సంవత్సరం వార్షిక రక్షణ పక్షోత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
శ్రీరాంపూర్ ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో రక్షణ వారోత్సవాలలో మీ అందరితో పాటుగా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఉద్యోగులందరికీ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. చేసే పనుల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరిస్తూ రక్షణను ఎల్లవేళలా చూస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం నాయకులు బాజీ సైదా
ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏరియా రక్షణాధికారి శ్రీధర్ రావు, సీహెచ్‌పీ ఇన్చార్జ్ చంద్రలింగం, ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు గాబ్రియల్ రాజు, డాక్టర్ పద్మ, మహేంద్రనాథ్, హనుమాన్ గౌడ్, వెంకటేశ్వర్లు, సతీశ్ కుమార్, శ్రీనివాస్, రక్షణ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.