జూన్ 12 నుంచి సదరం క్యాంపులు

మెదక్​ టౌన్, వెలుగు:  మెదక్​ వ్యాప్తంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో    అర్హులైన వారికి సదరం  పత్రాలు  అందించేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా డీఆర్డీఓ శ్రీనివాస్​రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  సదరం క్యాంపునకు హాజరయ్యే వారు ఆన్​లైన్​లో స్లాట్​ బుక్ చేసుకొని రశీదులో వచ్చిన  రోజు ఉదయం 9  గంటల నుంచి మధ్యాహ్నం 12  గంటల వరకు హాజరు కావాలని  ఈనెల 12న శారీరక వికలాంగులు, 13న మూగ, వినికిడి లోపం ఉన్న వారికి, 20న  దృష్టిలోపం ఉన్న వారికి, 21న మానసిక వికలాంగులకు అర్హులైన వారిని గుర్తించి సర్టిఫికెట్​ అందిస్తామని తెలిపారు.