రైతు రుణమాఫీ: రైతును రాజును చేయడం కాంగ్రెస్ కే సాధ్యం: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం  బెల్లంపల్లి మండలం   ఐబీలోని రైతు వేదికలో జరిగిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు.  రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి కాంగ్రెస్ కార్యకర్తలతో సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఒకేసారి రుణమాఫీ దాఖలాలు ఇప్పటివరకు లేవని    రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి  రెండు లక్షల రుణమాఫీ చేయడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగగా చూడలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ లో తెలిపినట్లు గానే రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేకంగా  కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా 31 వేల కోట్ల తో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే నని కొనియాడారు. రైతును రాజు చేయడం కాంగ్రెసుతోనే సాధ్యం అన్నారు.

మానకొండూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన  వెలిచాల రాజేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా  ఆర్మూర్ పట్టణంలో   కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి  ఆధ్వర్యంలో  రైతులు  భారీ బైక్ ర్యాలీ చేశారు.   రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడంతో రైతుల హర్షం వ్యక్తం చేశారు.  పెర్కిట్ నుండి మామిడిపల్లి చౌరస్తా మీదుగా ఆర్మూర్ పట్టణం లోని ర్యాలీగా రైతు వేదికకు రైతులు  తరలివచ్చారు.మోర్తాడ్ లో  ముఖ్యమంత్రి చిత్రపటానికి  కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నేతలు  ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి , రాహుల్ గాంధీ చిత్రపటాలకు  టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ నేత మార్క్ విజయ్ కుమార్ పాలాభిషేకంచేశారు.   కొమురం భీం జిల్లా  చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడా గ్రామంలోని రైతు వేదికలో రైతు రుణ మాఫీ సంబరాల్లో  సిర్పుర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు,రైతులు అదికారులు పాల్గొన్నారు.