జీవిత కాల కనిష్టానికి రూపాయి విలువ..కారణం ఇదే

న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి  పతనం కొనసాగుతూనే ఉంది. బుధవారం 17 పైసలు తగ్గి 85.91 దగ్గర జీవిత కాల కనిష్టాన్ని  తాకింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలర్ విలువ బలపడడమే ఇందుకు కారణం.  

దీనికి తోడు ఇండియా స్టాక్ మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా కదలడం, విదేశీ ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తుండడంతో రూపాయి పతనం ఆగలేదు. డాలర్ మారకంలో   బుధవారం 85.82 దగ్గర ఓపెన్ అయిన రూపాయి, ఇంట్రాడేలో మరింత పడింది.

ఇతర మేజర్ కరెన్సీలతో డాలర్ వాల్యూని కొలిచే డాలర్ ఇండెక్స్  బుధవారం 0.35 శాతం పెరిగి 108.76 వద్ద ట్రేడవుతోంది. 10 ఏళ్ల యూఎస్ బాండ్ ఈల్డ్‌ 4.67 శాతానికి చేరుకుంది. బ్రెంట్ క్రూడాయిల్ ఒక శాతం లాభపడి బ్యారెల్‌కు 77.74 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.