మరింత పడిన రూపాయి విలువ

న్యూఢిల్లీ: డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మారకంలో రూపాయి పతనం కొనసాగుతోంది.  జీవిత కాల కనిష్టమైన 84.87 లెవెల్‌‌‌‌‌‌‌‌కు గురువారం క్షీణించింది. మార్కెట్ నష్టాల్లో కదలడంతో పాటు క్రూడాయిల్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి వెళ్లిపోతుండడం రూపాయి విలువ పతనానికి కారణం.  ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 84.85 దగ్గర ఓపెన్ అవ్వగా,  ఇంట్రాడేలో 84.88 కి పడింది. చివరికి 84.87 లెవెల్ దగ్గర సెటిలయ్యింది. 

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జోక్యం అవసరం..

క్రూడాయిల్ ధరలు పెరిగితే  రూపాయి విలువ మరింత పడొచ్చని మిరాయి అసెట్‌‌‌‌‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌ అనుజ్ చౌదరి అన్నారు. యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరగడంతో  డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలపడుతోందని చెప్పారు.  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ జోక్యం చేసుకుంటే రూపాయి పతనం ఆగొచ్చని పేర్కొన్నారు. ట్రేడర్లు యూఎస్ పీపీఐ డేటా, అన్ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్ డేటా కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. డాలర్–రూపాయి   84.65–85.10 మధ్య కదులుతుందని అంచనా వేశారు. కాగా, బ్రెంట్‌‌‌‌‌‌‌‌ క్రూడాయిల్ 73.78 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.