ముంబై: రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. మంగళవారం (డిసెంబర్ 10) ప్రారంభ ట్రేడింగ్ లో యూఎస్ డాలర్ తో పోలిస్తే 84.75 ఉన్న రూపాయి విలువ 9 పైసలు దిగజారి 84.83 లకు చేరింది. బ్యాంకర్లు, దిగుమమతి దారుల నుంచి యూఎస్ డాలర్ కు పెరుగుతున్న డిమాండ్ తో రూపాయి విలువ కనిష్టస్థాయికి చేరింది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ మల్హోత్రా నియామకంతర్వాత దేశీయ యూనిట్ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయి ఇంట్రాడేడ గరిష్టంంగా 84.85 కనిష్టంగా 84.80 వద్ద నమోదు అయింది.
Also Read :- నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ రిలీజ్
ప్రారంభ ట్రేడ్ లో ఈక్విటీ మార్కెట్ పుంజుకోవడం, ఇతర ప్రపంచ కరెన్సీలతో డాలర్ స్థిరంగా ఉండటంతో రూపాయి బలహీన పడిందని ఫారెక్స్ మార్కెట్ డీలర్లు చెబుతున్నారు.