- నలుగురికి గాయాలు, తండ్రీబిడ్డలు సీరియస్
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర టాకీస్ఐల్యాండ్దగ్గర సోమవారం ఆర్టీసీ బస్సు రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా తండ్రీబిడ్డలు సీరియస్‌గా ఉన్నారు. మంచిర్యాల సాయికుంటకు చెందిన రేకుంట రమేశ్(42), కూతురు దీప(20) బైక్‌పై వస్తుండగా, శ్రీరాంపూర్ఆర్కే6 ఏరియాకు చెందిన నవీన్(26), అతడి బావ బండి మహేశ్(37) మరో బైక్‌పై వెళ్తున్నారు.
వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఐల్యాండ్వద్ద రెండు బైక్‌లను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమేశ్, దీప తలకు బలమైన గాయాలయ్యాయి. కండిషన్ సీరియస్‌గా ఉండడంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం కరీంనగర్‌కు తరలించారు. నవీన్, మహేశ్‌కు స్పల్ప గాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం బండ్లపల్లికి చెందిన బండి మహేశ్అత్తారింటికి వచ్చి యాక్సిడెంట్‌కు గురయ్యాడు.