నిర్మల్ లో ఆర్​ఎస్​ఎస్​ పథ సంచలన్

 నిర్మల్, వెలుగు: ఆర్ఎస్​ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్మల్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా విజయ దశమి పథ సంచలన్ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​గా పడగెల కృష్ణ సంతోష్ హాజరు కాగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవహ కాచం రమేశ్​ ప్రసంగించారు. హిందూ మతం ఏ మతానికి వ్యతిరేకం కాదని, హిందుత్వం జీవనవిధానమన్నారు.

సమాజ ఐక్యత, సామాజిక సేవ కోసమే 99 ఏండ్లుగా ఆర్ఎస్ఎస్ హిందువులందరినీ సంఘటితం చేస్తోందన్నారు. ప్రతి రంగంలో ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యమవుతోందని, దేశవ్యాప్తంగా లక్షకుపైగా శాఖలను నిర్వహిస్తోందని వివరించారు. మానవత్వమే హిందుత్వమని పేర్కొన్నారు. ఆర్ఎస్​ఎస్ ను మరింత విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో ఆర్ఎస్​ఎస్ జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, నగర సంఘ చాలక డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, జిల్లా కార్యవాహ బొద్దుల అశోక్, సీనియర్ ప్రతినిధులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రామనాథ్ ,ఆడెపు సుధాకర్, పతికే రాజేందర్, సోలాపూర్ రాజేశ్వర్ పాల్గొన్నారు.