పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత

సంగారెడ్డి: పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టుబడింది. నియోజకవర్గంలో ఏప్రిల్25వ తేదీ గురువారం చిట్కుల్, రామచంద్రాపురం ప్రాంతాల్లోని పలు ఇళ్లలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ప్రొహిబిషన్ అధికారుల ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ కు చెందిన లడ్డూలాల్, రాజేందర్ దగ్గర నుంచి రూ.5 లక్షల విలువ చేసే120 గ్రాముల నల్లమందు, రెండున్నర కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి  సెల్ ఫోన్లు, కారు, ఒక రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు నారాయణ్ జెట్, నారాయణ్ లాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తామని అధికారులు తెలిపారు.