CEO Jagdeep Singh: రోజుకు రూ. 48కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక జీతం.. మన భారతీయుడికే

ఉద్యోగం అంటే ఒకప్పుడు వేలల్లో మాత్రమే జీతం ఉండేది.. కానీ, గ్లోబలైజేషన్, ఐటీ రంగం పుణ్యమా అని లక్షల్లో జీతం కూడా మాములు విషయం అయిపోయింది. ఇక కంపెనీల సీఈఓల జీతం విషయానికి వస్తే కోట్లలోనే లెక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇండియాకు చెందిన ఒక సీఈఓ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుకు రూ. 48కోట్ల జీతం అందుకుంటున్నారని.. ప్రపంచంలోనే ఇది అత్యధిక జీతం అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

ఇండియాకు చెందిన జగదీప్ సింగ్ క్వాంటం స్కేప్ అనే సంస్థకు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందుకు గాను జగదీప్ ఏడాదికి రూ. 17 వేల 500 కోట్లు జీతం ( రోజుకు రూ. 48 కోట్లు ) అందుకుంటున్నారని వార్తల సారాంశం. అన్టాప్ నివేదిక ప్రకారం, జగదీప్ సింగ్ అనేక కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించిన అనుభవంతో క్వాంటమ్ స్కేప్ సంస్థను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారని తెలుస్తోంది.

ALSO READ | నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..

జగదీప్ సింగ్ సాంకేతిక రంగంలో అనేక పరిశోధనలు చేసి.. తమ సంస్థను విజయం వైపు నడిపించారని.. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో క్వాంటం స్కేప్ పురోగతి సాధించటంలో, విప్లవాత్మక మార్పులు తీసుకురావటంలో జగదీప్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.. క్వాంటమ్ స్కేప్ స్థాపించకముందు జగదీప్ పలు ప్రముఖ సంస్థల్లో కీలక పదవుల్లో పనిచేసినట్లు తెలుస్తోంది.

జగదీప్ సింగ్ జీతం గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. జగదీప్ జీతం అంశం ఇండియన్స్ సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసేలా చేసిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.