బీఆర్​ఎస్​ నేతపై రౌడీషీట్​

  • హత్యాయత్నం కేసులో​ అరెస్ట్

సిద్దిపేట రూరల్, వెలుగు: భూ వివాదాల్లో జోక్యం చేసుకొని పలువురిపై దాడులకు పాల్పడ్డ బీఆర్ఎస్  నేత ఆలకుంట మహేందర్ పై సిద్దిపేట వన్ టౌన్  పోలీసులు రౌడీషీట్  ఓపెన్  చేశారు. గతంలో అతడిపై ఏడు కేసులు ఉండడం, తాజాగా తన అన్న డిప్యూటీ తహసీల్దార్​ అశోక్ తో కలసి ఓ భూ వివాదంలో ఓ వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు. సిద్దిపేట ఏసీపీ జి మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న వడ్డెర కాలనీ సమీపంలో కరీంనగర్ కు చెందిన నసీం ఖాన్  తన తమ్ముడు అతీఫ్ తో కలసి తమ అత్త అమీనా సుల్తానాకు చెందిన భూమిలో అక్రమ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. 

వారిపై ఆలకుంట అశోక్, ఆలకుంట మహేందర్  బండరాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారని, కొంత మంది వ్యక్తులను తీసుకొని వచ్చి కత్తితో చంపే ప్రయత్నం చేసినట్లు కంప్లైంట్​ రావడంతో హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్  చేసినట్లు తెలిపారు. ఫేక్​ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్  చేయించుకుని, వాటితో మున్సిపల్  పర్మిషన్  తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టినట్లు విచారణలో తేలిందన్నారు. , ఆ సమయంలో అడ్డుకున్నందుకు హత్యయత్నం చేసారని తెలిపారు. నిందితులను వన్  టౌన్  సీఐ లక్ష్మీబాబు అరెస్ట్​ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఇదిలాఉంటే అశోక్  ఆర్డీవో  ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్​గా పని 
చేస్తున్నాడు.

ఫేక్  డాక్యుమెంట్ సృష్టించిన కేసులో..

మనోహరాబాద్, వెలుగు: ఫేక్  డాక్యుమెంట్  సృష్టించి రిజిస్ట్రేషన్  చేసిన ఘటనలో మంగళవారం తూప్రాన్​ సబ్​ రిజిస్ట్రార్​తో పాటు ఐదుగురిని అరెస్ట్​ చేసినట్లు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్  మోతీనగర్ కు చెందిన సత్యనారాయణమూర్తి, స్వాతి దంపతులకు మండలంలోని కుచారం గ్రామ శివారులోని 225,226 సర్వే నంబర్ లో స్థలాన్ని రూ.80 లక్షలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి హైదరాబాద్ కు చెందిన మల్లవరపు అరుణ్ కుమార్, మరో 8 మందితో కలిసి అమ్మాడు.

సత్యనారాయణ దంపతులు లింక్  డాక్యుమెంట్లు ఇవ్వమంటే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి స్థలాన్ని పరిశీలించగా, అసలు యజమాని దుర్గ అని తేలింది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలం అమ్మినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో నలుగురిని అరెస్ట్​ చేశారు. మంగళవారం తూప్రాన్  సబ్  రిజిస్ట్రార్  రమణ, పిట్ల సాయికుమార్, వేముల ప్రభాకర్, నంగునూరు లక్ష్మి, డాక్యుమెంట్  రైటర్  ఉన్నారు.