రామాయంపేట, వెలుగు: రామాయంపేట మున్సిపాలిటీలోని కేసీఆర్ కాలనీలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం చేశారు. 10 ఇండ్లలో చొరబడి సుమారు రూ. 50 వేల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. కాలనీలోని నాగరాణి, ప్రేమలత, సంతోష, పెంటమ్మతో పాటు మరో ఆరు ఇండ్ల తాళాలను దొంగలు పగులగొట్టి సామగ్రి చిందర వందర చేశారు. ప్రేమలత ఇంట్లోని10 తులాల వెండితో పాటు బీరువలోని చీరలు, నాగరాణి ఇంట్లో 2 గ్రాముల కమ్మలు, తులం వెండి, ఇతరులు ఇండ్లలో బట్టలను ఎత్తు కెళ్లారు. బాధితులు గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు.
కేసీఆర్ కాలనీలో దొంగల బీభత్సం.. 10 ఇండ్ల తాళాలు పగలకొట్టి చోరీ
- మెదక్
- August 30, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.