ఈ బురద రోడ్డులో స్కూల్​కు పోయేదెట్ల?

కాగజ్‌నగర్‌ వెలుగు : కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి–అందవెల్లి గ్రామాల మధ్య రోడ్డు గుంతలమయమై బురదతో నిండింది. దీంతో స్కూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బుధవారం విద్యార్థులు బురద నీటిలో నిలబడి నిరసన తెలిపారు. 

ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా గతంలో ఆ భూమి తమదేనని రైతులు కోర్టులో కేసు వేశారు. ఫలితంగా గుంతలమమైన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.